మంగళగిరిలో టెక్నో సాఫ్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను APNRTS ద్వారా ప్రారంభించారు

మంగళగిరిలో టెక్నో సాఫ్ట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ సంస్థను APNRTS సీఈఓ శ్రీ కె భవానీ శంకర్ గారు ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత APNRTS ద్వారా మొట్టమొదటి సంస్థ అమరావతిలో స్థాపించడం చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం నుంచి సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు.