Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRT స్థాపించిన అంతర్జాతీయ నైపుణ్య శిక్షణా కేంద్రము లలో మొదటి బ్యాచ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ కోర్స్ లో 130 మంది శిక్షణ తీసుకున్నారు . 3 నెలల శిక్షణ అనంతరం వారికి నైపుణ్య ధృవపత్రం అందచేసారు . శిక్షణ తరువాత APNRT అభ్యర్థులందరికీ ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా APNRT గల్ఫ్ లోని వివిధ కంపెనీ లతొ ఒప్పందాలు చేసుకుంది. ఒప్పందం చేసుకున్నవారిలో దుబాయ్ లో ని స్కైలైన్ ఎలెక్ట్రో మెకానికల్ కంపెనీ వారికి రెండు నుండి మూడు సంవత్సరాలు అనుభవం కలిగిన 50 మంది ఎలెక్ట్రిసియన్స్ అవసరం కాగా వారికకి 25-05-2019 మరియు 26-05-2019 ఇంటర్వ్యూలు నిర్వహించారు .ఈ రెండు రోజులలో 130 మందికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అనగా 25-05-2019 వ తారీఖున 70 మందిని ఇంటర్వ్యూ చేయటం జరింది. వారిలో 28 మందిని ఎంపిక చేయటం జరిగింది.ఈ రెండు సంవత్సరాలు కాంట్రాక్టు అగ్రిమెంట్ తొ వారికి నెలకు 25వేల నుండి 30 వేల వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. దీనితో పాటు కంపెనీ వారు ఉచిత వీసా మరియు విమాన చార్జీలు ఇస్తారు . ఎంపిక అయిన అభ్యర్థులు ,వీసా వచ్చిన తరువాత వారికి PCC,మెడికల్ సర్టిఫికెట్స్ ,వీసా అటెస్టేషన్ లాంటి పనులన్నీ చేయించుకోవలసి ఉంటుంది. దానికి అవసరమయ్యే ఖర్చు అభ్యర్థి భరించవలసి ఉంటుంది. రంజాన్ మాసం తరవాత గల్ఫ్ లోని మరికొన్ని ఒప్పందం చేసుకున్న కంపెనీలు వారికి అవసరమయిన అభ్యర్ధుల కొరకు ఇంటర్వ్యూలు జరిపే అవకాశం ఉందని APNRT ప్రకటించింది.