Embassy
Facebook
Twitter
Instagram
Youtube
మలేషియా యువకులకు ఏపిఎన్‌ఆర్‌టి సాయం.ఏజెంట్ చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నయువకులను తిరిగి స్వగ్రామాలకు తీసుకురావడానికి ఏపిఎన్‌ఆర్‌టి ప్రయత్నిస్తోంది. తొమ్మిది నెలల క్రితం విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన నలుగురు యువకులు మలేషియా లో ఉద్యోగాలకోసం వెళ్ళి అక్కడ ఏజెంట్ వల్ల మోసపోయి భారత దేశానికి ఎలా తిరిగి రావాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపిఎన్‌ఆర్‌టి వారిని తిరిగి ఇండియా పంపుటకు గాను ఏజెంట్ తో మాట్లాడి వారి స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపిఎన్‌ఆర్‌టి మరియు టీమ్ అసోసియేషన్ కలిసి వీరిని ఇండియా పంపించడానికి కృషి చేస్తున్నారు. ఈ నలుగురు ప్రస్తుతం క్షేమంగా టీమ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన షెల్టర్ లో ఉన్నారు. వీరిని ఎంత త్వరగా వీలైతే అంతా త్వరగా స్వగ్రామాలకు చేర్చనున్నారు.