Embassy
Facebook
Twitter
Instagram
Youtube
పాత్రికేయ, సినీ రంగాల్లో విశేష సేవలందిస్తున్న పలువురు రచయితలకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జీవన సాఫల్య, తెలుగు భాషా సేవారత్న పురస్కారాలు ప్రదానం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయంలో జరిగిన కార్యక్రమంలో సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. రచయితలను పిలిచి గౌరవించినందుకు ప్రభుత్వానికి, అధికార భాషా సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తాను పాటతోనే పుట్టి పెరిగా నని.. 30 ఏళ్లలో 3 వేల పాటలు రాశానని చెప్పారు. సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ తెలుగు నేలపై రావడానికి తన తండ్రి, తాను కృషి చేశామని, దానికి దక్కిన గౌరవంగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నానన్నారు. ఈ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయ బాబు మాట్లాడుతూ... పత్రిక, రచనా రంగంలో విశేష సేవలందించిన రచయితలను సన్మానించి, వారిని గౌరవించాలన్న లక్ష్యంతో ఈ పురస్కా రాలు అందజేస్తున్నామన్నారు. తద్వారా తెలుగు భాషకు సేవ చేసేవారిని మరింతగా ప్రోత్సహించాలనేది తమ లక్ష్యమన్నారు. ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు వెంకట్ ఎస్ మేడపాటి మాట్లాడుతూ.. పురస్కారాల ద్వారా తెలుగు రంగానికి ఆదర్శవంతమైన సేవలు చేసిన వారిని గౌరవిస్తున్నామన్నారు. ఏపీ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలుగు భాషాభివృద్ధికి ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఏఎన్ యూ వీసీ పి. రాజశేఖర్ మాట్లాడుతూ.. అధికార భాషా సంఘం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తున్నామన్నారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వీసీ కొలకలూరి ఇనాక్, ఏఎన్ యూ రెక్టార్ పి.వరప్రసాదమూర్తి ప్రసం గించారు. అనంతరం పలువురు రచయితలకు, జర్నలిస్టులకు జీవన సాఫల్య పురస్కారాలు, తెలుగు భాషా సేవారత్న పురస్కారాలు అందజేశారు.