Embassy
Facebook
Twitter
Instagram
Youtube
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణశర్మ అన్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న కన్వె న్షన్ సెంటర్ లో మినీ జాబ్ మేళాను ఆదివారం నిర్వహించారు. ముందుగా సబ్ కలెక్టర్తో పాటు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి , ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మాట్లాడుతూ.. అందివచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతీ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆదోని ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటైంద న్నారు. మినీ జాబ్ మేళాలో 250 మంది యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఫైవ్ స్టార్ హోటల్ యజమాని పవన్ కుమార్ రెడ్డి , స్కిల్ డెవ లప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ , పర్యాటకశాఖ డైరెక్టర్ గోపాల్, ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సొసైటీ సీఈఓ హేమలతరాణి పాల్గొన్నారు.