ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రీమియంలో 50 శాతం రాయితీ అంది అందిస్తున్నట్లు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి, సీఈవో పి. హేమలతారాణి తెలిపారు. విదేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్ర ఉద్యోగులు, వలస కార్మికులు, డ్రైవర్లు,
హౌస్మెయిడ్స్, హెల్పర్లు, విద్యార్థులకు ఇదొక సదావకాశమని శుక్రవారంఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాల్లో వివిధ రంగాల్లో పని చేసేవారు ఇప్పటివరకు 3 సంవత్సరాలకు రూ.550 ప్రీమియం, విద్యార్థులైతే సంవత్సరానికి రూ.180 ప్రీమియం చెల్లించేవారని, ఇప్పుడు ఉద్యోగులు కేవలం రూ.275 తోను, విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థులు పూర్తి ఉచితంగాను ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చుననివారు వివరించారు. ఈనెల 26 నుంచి జనవరి 15వ తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ
మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షల ఆర్థిక సాయం, ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు రూ. లక్ష వరకు చెల్లిస్తారని తెలిపారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు రూ.50 వేల వరకు చెల్లిస్తారని,వీటితోపాటు ఇంకా అనేక ప్రయోజనాలుంటాయని పేర్కొన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఏపీఎన్ఆర్డీఎస్. ది న్యూ ఇండియాఅస్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా నమోదు కోసం ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నెంబరు +91-863-2340678,-918500027678 (వాట్సాప్) లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వెబ్ సైట్ http-s://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లేదా insurance@apnrts.com; helpline@apnrts.com కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.