Embassy
Facebook
Twitter
Instagram
Youtube
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్ లోని ప్యారిస్ (ఫ్రాన్స్), డబ్లిన్ (ఐర్లాండ్) నగరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యా ణం అంగరంగ వైభవంగా జరిగింది. అక్టోబర్ 7న ప్యారిస్, 8న డబ్లిన్ శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారు ఎన్నారై భక్తులకు దర్శ నమిచ్చారు. స్థానిక తెలుగు, భారతీయ ధార్మిక సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఏపీఎన్ఆర్ఎఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలను సమన్వయం చేస్తూ కల్యాణం సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు. టీటీడీ నుంచి వెళ్లిన అర్చకులు, వేదపండితులు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవాలను వైభవంగా జరిపించారు. ఈ కల్యాణోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి తెలుగు వారే కాక, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరైనట్టు వెంకట్ మేడపాటి తెలిపారు. ఆయా ప్రాంగణాలు గోవింద నామస్మరణతో మారుమోగాయని, హాజరైన భక్తులంద రికి తిరుమల నుంచి తెప్పించిన స్వామివారి లడ్డూలను ప్రసాదంగా అందించామని చెప్పారు. యూరప్ లోని మరో రెండు నగరాల్లో 14, 15 తేదీల్లో శ్రీవారి కల్యాణాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.