Embassy
Facebook
Twitter
Instagram
Youtube
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్, యూకేలో మలయప్ప స్వామి కల్యాణోత్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కల్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫ్రాంక్ఫర్ట్, ఉట్రే చ్ట్-నెదర్లాండ్స్లో టీటీడీ అర్చకులు, వేద పండి తులు వైఖానస ఆగమం ప్రకారం కల్యాణ క్రతువు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎస్ఆర్ ఐలు హాజరై భక్తి పారవశ్యంతో పులకించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్ఆర్డీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్స వాలను నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి సమన్వ యంతో ప్రపంచంలోని తెలుగు, భారతీయ, ధార్మిక సంస్థల సహకారంతో శ్రీవారి కల్యా ణాలు కనుల విందుగా సాగుతున్నాయన్నారు. కల్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు. యూర ప్లో స్వామి వారి కల్యాణానికి శివరామ్ తడి గొట్ల, ఏపీఎన్ఆర్ఎఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ కార్తీక్ యార్లగడ్డ, జి.వెంకట కృష్ణ, సూర్య ప్రకాష్ తదితరులు ఏర్పాట్లు చేశారని వివరించారు