తిరుమల తిరుపతి దేవ స్థానం ఆధ్వర్యంలో అమెరికా, కెనడా దేశాల్లో రెండు నెలలుగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ మేరకు ఏపీఎన్ఆ ర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి ఓ ప్రకటనలో వివరించారు. అమెరికాలో జూన్ 4వ తేదీ నుంచి జూలై 22 వరకు 14 నగ రాల్లో కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించగా.. దాదాపు 60 వేల మంది ఎన్నారై భక్తులు ప్రత్యక్షంగా స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచనలతో కెనడాలోని టొరంటో, మాంట్రియల్, అట్టావా, అమెరి కాలోని ర్యాలీ (నార్త్ కరొలినా), జాక్సన్ విల్, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, డల్లాస్ (నాటా), సెయింట్ లూయిస్, ఫిలడెల్ఫియా (తానా), మొర్గాన్విల్ - న్యూ జెర్సీ, హూస్టన్, ఇర్వింగ్ (టెక్సాస్) నగరాల్లో తెలుగు, భారతీయ సంస్థల సహకారంతో స్వామి కల్యాణ క్రతువులు జరిపించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వ హించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. గత 13 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 36 నగరాల్లో టీటీడీ స్వామివారి కల్యాణం నిర్వహించిందని పేర్కొన్నారు. జూలై 15న మొర్గాన్విల్ - న్యూజెర్సీలో మహేందర్, శ్రీ రామ్మోహన్, 16న హూస్టన్ లో మారుతి, మహేష్, బ్రహ్మ, దుర్గా ప్రసాద్, 22న ఇర్వింగ్ (టె క్సాస్) నగరాల్లో గిరి, విజయ మోహన్ స్వామి వారి కల్యాణ ఏర్పాట్లను చేశారని వివరించారు. టీడీపీ ఏఈవో బి.వెంక టేశ్వర్లు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారని తెలిపారు.