Embassy
Facebook
Twitter
Instagram
Youtube
దివ్యాంగులను ప్రేమతో ఆదరిం చడం సామాజిక బాధ్యతగా భావించాలని ఏపీఎ న్నార్టీ సొసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి అన్నారు. స్థానిక శిరీష మానసిక దివ్యాంగుల స్వచ్ఛంద సేవాసంస్థకు రూ. 3 లక్షలు విలువ చేసే ఆటోను గురువారం ఆయన వితరణగా అందించారు. వెంకట్ మాట్లాడుతూ శిరీష మానసిక దివ్యాంగుల కేంద్రానికి సొసైటీ తమ వంతు సాయం ఎప్పుడూ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ సీఈఓ హేమలత, డిప్యూటీ డైరెక్టర్ విజయకుమారి, కేంద్రం సెక్రటరీ ఎంఎస్ రావు పాల్గొన్నారు