Embassy
Facebook
Twitter
Instagram
Youtube
అమెరికాలోని సెయింట్ లూయిస్ లోని ది హిందూ ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణోత్స వాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కలియుగ దైవం భక్తులకు మలయప్ప స్వామిగా దర్శనమిచ్చారు. పండితులు వైఖానస ఆగమం ప్రకారం 'శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కళ్యాణాన్ని జరిపించారు. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి కళ్యాణోత్స వాలను టీటీడీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తానాలో జరిగిన వేంకటేశ్వర స్వామి కళ్యాణానికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు, సినీ నటుడు రాజేం ద్రప్రసాద్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.