Embassy
Facebook
Twitter
Instagram
Youtube
మాల్దీవులలో జరిగిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరి హారం రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. ఇటీవల మాల్దీవులలోని మాలేలో అగ్నిప్రమాదం జరగ్గా, మన దేశానికి చెందిన తొమ్మిది మంది మరణించారు. వీరిలో మన రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా వారు నలుగురు, చిత్తూరు జిల్లా వాసి ఒకరు ఉన్నారు. సచివాలయంలో బుధవారం ఆయా కుటుంబసభ్యులకు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే మాలేలో ప్రమాదం వార్త తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఏపీఎన్ఆర్టీఎస్ సహకారంతో మృతదేహాలను త్వరతగతిన రాష్ట్రానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మృతుల కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.