సుడాన్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో "అపరేషన్ కావేరి" ద్వారా కేంద్రప్రభుత్వం భారతీయులను స్వదేశానికి తీసుకోస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్, జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఢిల్లీ లో ఏపీ భవన్ అధికారులు, జిల్లాల అడ్మినిస్ట్రేషన్ అధికారులు మన రాష్ట్ర వాసులను ఆయా విమానాశ్రయాల నుండి స్వస్థలాలకు చేరుస్తున్నారు. ఇప్పటి వరకు స్వదేశం చేరుకున్న 98 మంది రాష్ట్ర వాసులలో 97 మంది సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకోగా, మరొకరు (01) విజయవాడ చేరుకోనున్నారు. న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ విమానాశ్రయాలకు నేరుకున్న అందరిలో. 63 మందిని రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ప్రయాణ, ఇతర సదుపాయాల ఏర్పాట్లు చేసి, అక్కడి నుండి విమాన మార్గం. రోడ్డు మార్గం ద్వారా ఏపీ భవన్ అధికారులు, అధికారులు... జిల్లాల అడ్మినిస్ట్రేషన్ అధికారులు సహకారంతో వారి వారి స్వస్థలాలకు చేర్చడం జరిగిందని అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేదపాటి తెలిపారు. మిగిలినవారు, వారు పనిచేస్తున్న సంస్థల ద్వారా వారి వారి ఇళ్ళకు చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ - సాధారణ పరిపాలన శాఖ ముత్యాల రాజు, ఐఏఎస్ గారి పర్యవేక్షణలో నిరంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షి కౌషిక్ సీఈఓ పి. హేమలత రాణి, జిల్లాల అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరియు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని వెంకట్ గారు తెలిపారు. షెడ్యూల్ అయిన విమానాల్లో రిజిస్టర్ చేసుకున్న మరియు చేసుకోని మొత్తం ఏపీ వాసులందరినీ క్షేమంగా తమ ఇళ్ళకు చేర్చడం జరిగింది. ఇళ్ళకు చేరుకున్న రాష్ట్రవాసులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో తమను తమ, తమ ఇళ్ళకు క్షేమంగా చేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశంసిస్తూ, కృష్ణతలు తెలిపారు.