Embassy
Facebook
Twitter
Instagram
Youtube
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ఫ్లోరేషన్ రోవర్ చాలెంజ్ (హెచ్ఆర్సీ) - 2023లో రాష్ట్ర విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఏటా నిర్వహించే ఈ పోటీల్లో ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 60 బృందాలు పోటీ పడ్డాయి. భారతదేశం నుంచి ఆరుగురితో కూడిన బృందం సోషల్ మీడియా అవార్డు సాధించింది. ఈ బృందంలో ఆంధ్రప్ర దేశ్కు చెందిన సాయి అక్షర వేమూరి, ఆకర్ష్ చిట్టినేని ఉన్నారు. అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని హంట్స్వి ల్లేలో ఉన్న స్పేస్ అండ్ రాకెట్ సెంటర్లో గత నెలలో ఈ పోటీలు జరిగాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) కార్యకలాపాలు, కమ్యూనికేషన్ నైపు ణ్యాలను సోషల్ మీడియా ద్వారా నాసాతో పంచుకునే విధంగా ఈ బృందం కృషి చేసింది. వీరు సమర్పించిన ఇం జినీరింగ్ ప్రాజెక్టును నాసా బృందం ప్రత్యేకంగా అభినందిం చడంతో పాటు భవిష్యత్లో ఈ ప్రాజెక్టును ఉపయోగించు కునే విధంగా కృషిచేస్తామని ఆ బృందం తెలిపింది. విద్యార్థులకు ఏపీఎన్ఆర్టీఎస్ సన్మానం నాసా పోటీలో విజయం సాధించిన ఈ విద్యార్థులను బుధవారం తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారి అనుభవాలు పంచుకున్నారు. విజయవాడకు చెందిన సాయి అక్షర ఇంటర్ పూర్తిచే సింది. హెచ్ ఆర్సీ-2023లో స్టూడెంట్ సేఫ్టీ ఆఫీసర్ పనిచేసింది. చదువుల్లోనే కాకుండా ఆర్చరీ క్రీడాకారిణిగా కూడా రాణిస్తోంది. రక్తదానం కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రెడ్ క్రాస్ కోసం రూపొందించింది. విజయవాడకు చెందిన ఆకర్ష్ చిట్టినేని 10వ తరగతి చదువుతున్నాడు. హెచ్ ఈఆర్సీ-2023 టీమ్కి టెక్నికల్ లీడ్గా పనిచేశాడు. జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీల్లో పాల్గొనడంతో పాటు వివిధ సైన్స్ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ ఈ విద్యార్థుల ప్రతిభ రాష్ట్రంతో పాటు దేశానికి గర్వకారణమన్నారు. ఏపీ విద్యార్థులు రానున్న సంవత్సరాల్లో మరిన్ని విజయాలను సాధించడానికి ఏపీఎన్ఆర్టీఎస్ అండగా నిలుస్తుందన్నారు