Embassy
Facebook
Twitter
Instagram
Youtube
సూడాన్ లో చిక్కుకున్న ప్రవా సాంధ్రులను రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు 48 మంది సూడాన్ నుంచి ఇక్కడకు చేరుకున్నట్లు ఏపీఎస్ఆర్టీఎస్ సీఈవో వెంకట్ మేడపాటి తెలిపారు. సూడాన్లో అంతర్గత యుద్ధం కారణంగా రాష్ట్రానికి చెందిన 58 మందిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభు త్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం 37 మందిని రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చింది. శుక్రవారం బెంగళూరుకు 33 మం ది. మరో నలుగురు ముంబై, ఢిల్లీలకు చేరు కున్నారు. వీరిలో 34 మంది స్వస్థలాలకు చేరు కోగా, మిగిలిన ముగ్గురు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కార్డు లేని కారణంగా క్వారెంటైన్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వంతో సంబంధం లేకుం డా వారు పనిచేస్తున్న ప్రయివేటు కంపెనీల సహకారంతో, సొంతంగా ఇప్పటి వరకు మరో 11 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీకి మరో ఆరుగురు... ఆదివారానికి మరికొందరు బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మిగిలిన వారిని కూడా క్షేమంగా తీసుకొచ్చేలా రాయబార కార్యాలయంతో ఏపీఎన్ఆర్జీఎస్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి క్షేమంగా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 58 మంది ప్రవాసాంధ్రులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.