తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 28 ఏప్రిల్ 23 వ తేదీన బహ్రెయిన్ లోని సఖీర్ ప్రాంతంలో ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ లో నిన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం కళ్యాణాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ మొదటి నుండి తితిదేతో ఒకవైపు, నవ్ భారత్ సంస్థ కార్యనిర్వాహక వర్గంతో మరోవైపు సమన్వయము చేస్తూ ఎక్కడ, ఏ లోటు రాకుండా శాస్త్రం ప్రకారం కళ్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. సుప్రభాతం మొదలుకొని, పల్లకీసేవ వరకు దాదాపు 15వేల మందికి పైగా భక్తులు హాజరై స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకొని, భక్తిపరవశంతో పులకించారు. భక్తులందరికీ స్వామి వారి లడ్డూ ప్రసాదం అందించటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మొట్టమొదటిసారిగా కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ లో జరిగిన కళ్యాణం ఇది. ప్రధానంగా నవ్ భారత్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జి. ప్రదీప్ కుమార్, పలు తెలుగు అసోసియేషన్లు. ధార్మిక సంస్థలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా నవ్ భారత్ సంస్థ వ్యయ ప్రయాసలకోర్చి ముఖ్యపాత్ర పోషించింది. సంస్థ అధ్యక్షులు జి. ప్రదీప్ కుమార్, తెలుగు విభాగం అధ్యక్షులు మరియు ఏపీఎస్ఆర్టీఎస్ కో ఆర్డినేటర్ శ్రీ రాయుడు వి. రావు, సతీష్ శెట్టి, నిరంజన్, శ్రీమతి రుచి దూబే,. గంగాధర్ శ్రీనాథ్ రెడ్డి, పలు తెలుగు మరియు ధార్మిక సంస్థల సభ్యులు తదితరులు స్వామి వారి కల్యాణానికి కావలసిన సామాగ్రి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అన్ని ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేసారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ బహ్రెయిన్ లో మలయప్ప స్వామి వారి కళ్యాణం అక్కడి కార్యనిర్వాహక వర్గాల తోడ్పాటుతో, టీటీడీ పురోహితుల, వేద పండితుల ద్వారా నిర్వహించామని తెలియజేసారు. కళ్యాణోత్సవ క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం పల్లకి సేవ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారని, కళ్యాణం. అత్యంత కన్నుల పండుగలా జరిగిందన్నారు. జూన్ 4 వ తేదీ నుండి కెనడా మరియులలోని 13 నగరాలలో టీటీడీ శ్రీవారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణోత్సవం లో తితిదే నుండి బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి వెబ్ లైవ్ కవరేజ్ సమన్వయం చేశారు.