Embassy
Facebook
Twitter
Instagram
Youtube
సూడాన్లో చిక్కుకున్న ప్రవాసాం ధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలన్న - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎన్ఆర్టీ సొసైటీ చర్యలు చేపట్టింది. సూడాన్లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ సముద్రమార్గం లేదా విమానం ద్వారా జెడ్డాకు తరలించి అక్కడ నుంచి ముంబయి, ఢిల్లీకి తీసుకు రానున్నట్లు ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో వెంకట్ మేడపాటి బుధవారం తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి చెందిన 58 మంది సూడాన్లో ఉన్నట్లు గుర్తించారని, ఇందులో ఐదుగురు వారు పని చేస్తున్న కంపెనీ ద్వారా ఇండియాకు వస్తుండగా మిగిలిన వారిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 29 మంది పోర్ట్ ఆఫ్ సూడాన్కు చేరుకున్నారని వీరిని జెడ్డాకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మిగిలిన వారిని కూడా పోర్టు ఆఫ్ సూడానకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సూడాన్ లో ఉన్న వారి ఫోన్ నంబర్లను సేకరించి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశామని చెప్పారు. అవసరమైన సాయం, సమాచారం తెలసుకోవడం కోసం 24 గంటలు అం దుబాటులో ఉండేలా హెల్ప్ లైన్ నంబర్ 0863 234 0678, వాట్సాప్ నంబర్ 85000 27678 అం దుబాటులో ఉంచారని తెలిపారు. జెడ్డా నుంచి న్యూఢిల్లీ, ముంబయిలకు చేరుకున్న తర్వాత వారిని ప్రభుత్వ ఖర్చుతో స్వగ్రామాలకు పంపుతారన్నారు. ఈ ప్రక్రియలో ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు శుక్లా.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.