Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అన్ని అనుమతులు తీసుకోవాలని, ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సూచించారు. భారత ప్రభుత్వం గుర్తించిన ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లాలని చెప్పారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు సక్రమ వలసలపై ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం (ఏపీఎస్ఆర్ఎఎస్) ఆధ్వర్యాన మంగళవారం పశ్చి మగోదావరి జిల్లా తణుకులో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కారుమూరి మాట్లాడుతూ అక్రమ మార్గాల్లో విదే శాలకు వెళ్లే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని, ముఖ్యంగా ఎంతో కొంత సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనే ఆశతో టూరిస్ట్ వీసాతో విదేశాలకు వెళ్లి చిక్కుకుపోతుండడం బాధాకరమన్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం. వెళ్లిన కార్మికులు, ఏజెంట్ల మోసాలతో ఇబ్బందులు పడుతున్నవారిని స్వదేశానికి చేర్చడం, విదేశీ ఎం బసీలతో మాట్లాడి వారికి న్యాయం అందించడంలో ఏపీఎస్ఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశం సించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వం లో ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ప్రజలకు అం దుతున్న సంక్షేమ పథకాల వల్ల గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఏపీఎస్ఆర్టీఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్న మంత్రి కారుమూరి. పక్కన మేడపాటి వెంకట్ తదితరులు మేడపాటి వెంకట్ మాట్లాడుతూ కోవిడ్ సమయం లో వేలాదిమంది ఆంధ్రులను సురక్షితంగా స్వదేశా నికి చేర్చామని తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధ సమ యంలోనూ ఆంధ్రప్రదేశ్కు చెందిన 950 మంది వైద్య విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవాసాం ధ్ర భరోసా బీమా పథకం ద్వారా ఉద్యోగులకు మూడేళ్లకు రూ.550 చొప్పున రూ.10 లక్షలు ప్రమాద బీమా, విద్యార్థులకు ఏడాదికి కేవలం రూ.180తో రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిం చారని వివరించారు. ఎవరైనా విదేశాల్లో మరణిస్తే రూ.50 వేలు ఆర్థిక సాయంతోపాటు ఉచితంగా స్వదేశానికి తీసుకువస్తున్నట్లు తెలిపారు. గల్ఫ్ బాధి తురాలికి మంత్రి కారుమూరి రూ.5 వేలు అంద జేశారు. ఏపీఎన్ఆర్టి టీఎస్ సీఈవో పి. హేమలత రాణి, డైరెక్టర్ బీహెచ్ ఇలియాస్, డిప్యూటీ డైరెక్టర్ మొహమ్మద్ కరీముల్లా షేక్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య, వైఎ స్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాట్ల సుందరరామరాజు, నాయకులు మంగెన సూర్య, నూకల కనకదుర్గ పాల్గొన్నారు