Embassy
Facebook
Twitter
Instagram
Youtube
విదేశాల్లోనూ ఉపాధికి శిక్షణ రాష్ట్రంలోని యువత విదేశాల్లోనూ ఉపాధి. అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ముందడుగు వేసింది. ఇందుకు తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టీఏకేటీ గ్రూప్తో ఏపీఎస్ఎస్ఓసీ, ఏపీఎన్ ఆర్టీఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విదేశాల్లోనూ ఉపాధికి 'స్కిల్' శిక్షణ టీఏకేటీ గ్రూప్తో ఏపీఎన్ఆర్టీఎస్, ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం రాష్ట్ర యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధం గా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ఓ సీ) ముందడుగు వేసింది. మిడిల్ ఈస్ట్, యూరప్ తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లోని అవకాశా లను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని ఏపీఎస్ఎస్డీసీ కార్యాలయం లో టీఏకేటీ గ్రూప్తో ఏపీఎస్ఎస్ఓసీ, ఏపీఎన్ ఆర్టీఎస్ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకు న్నాయి. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్య నారాయణ, ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో వెంకట్ ఎస్ మేడపాటి, టీఏకేటీ గ్రూప్ ఎండీ రాజ్సిం గ్ సమక్షంలో పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వైద్యం నిర్మాణం ఆతిథ్య రంగాల్లోని విదేశీ అవకాశాలపై టీఏటీ గ్రూప్ ప్రధానంగా దృ ష్టి సారిస్తుంది. తొలి దశలో జర్మనీలోని అవ కాశాలను అందిపుచ్చుకునేందుకు 15 మంది నర్సింగ్ అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. వీరికి జర్మనీ భాషపై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వను న్నారు. వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రి ల్లో జర్మనీకి పంపిస్తారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవ కాశాలను కల్పించేందుకు 192 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్ఎస్ఓసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.