Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఏపీ ఎన్నార్టీఎస్ తో ఇంటర్మీడియెట్ బోర్డు ఒప్పందం రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ కాలేజీలలోని విద్యార్థులు, లెక్చరర్లకు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీ ప్రవాసాంధ్రుల సంఘం (ఏపీఎన్నార్టీఎస్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులు,లెక్చరర్లకు ఎన్ఆర్ఐ డాక్టర్లు, వర్చువల్ విధానంలో శిక్షణ ఇస్తారని పేర్కొంది. నైపుణ్యాల పెంపుతో పాటు పరీక్ష సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడానికి నిపుణులు శిక్షణ ఇస్తారని తెలిపింది. ఈ శిక్షణ ఒక్కో కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున 6,800 మందికి ఇవ్వనున్నట్లు పేర్కొంది.