Embassy
Facebook
Twitter
Instagram
Youtube
విద్యా, నైపుణ్య శిక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆస్ట్రేలియా ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాల యంలో విక్టోరియా రాష్ట్రానికి చెందిన ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ పార్లమెంటు సభ్యులతో కూడిన వాణిజ్య ప్రతినిధుల బృందం సోమవారం సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం విక్టోరియా ఎంపీ లీ తరలమిస్ మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన వనరులైన సోలార్, విండ్ ఎనర్జీల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆసక్తికరమైన చర్యలను తీసుకుందన్నారు. విద్య, నైపుణ్య శిక్షణ, ఇంధన రంగాల్లో అవకాశాలపై జరిగిన చర్చలపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్ర విద్యారంగం లో అమలవుతున్న పలు విధానాలు ఆస్ట్రేలియా విధానాలతో సారూప్యత కలిగి ఉన్నాయన్నారు. విద్యా, నైపుణ్య శిక్షణ రంగాల్లో పరస్పరం సహ కరించుకుంటామని.. విద్యా, ఇంధన రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు లీ తరలిమిస్ తెలిపారు.