Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విసృతమైన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, అత్యాధునిక టెక్నాలజీతో అభివృధ్ధి చెందుతున్న మీడియా రంగంలో వున్న అవకాశాలను వినియోగించుకోవాలని మేరీ స్టెల్లా కళాశాల జర్నలిజం విభాగం విద్యార్థులనుద్దేశించి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడారు. తన 40 ఏళ్ళ జర్నలిజం ప్రస్థానంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్నామని, వృత్తిలో రాణించాలంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ సమాజంలో జరిగే పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, విజయవాడ, మేరి స్టెల్లా కళాశాల జర్నలిజం విభాగం సంయుక్తంగా విజయవాడలో నిర్వహించిన సదస్సులో “జర్నలిజం మౌలిక సూత్రాలు – విలువలు” అనే అంశంపై ప్రసంగించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలలో పని చేయాలంటే డిజిటల్ సాంకేతికతలో వస్తున్న మార్పులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని, అందుకోసం విదేశీ యూనివర్సిటీలలో చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన ఎపి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఎపి ఎన్నార్టీ అధ్యక్ష్యులు వెంకట్ మేడపాటి అన్నారు. ఎపి రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో పలు అభివృధ్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని.. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కలను ఎన్నార్టీఎస్ నెరవేరుస్తుందని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలుపుతూ ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ను మేరి స్టెల్లా కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడమి సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. కళాశాల యాజమాన్యం సిస్టర్ స్లీవా తుమ్మ, సిస్టర్ సహాయ, శరత్ చంద్ర, ఎన్నార్టీఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ దండమూరి పద్మావతి తదితరులు పాల్గొన్నారు.