Embassy
Facebook
Twitter
Instagram
Youtube
జీవనోపాధి, విద్య, ఉద్యోగం వంటి పలు అవసరాలతో జిల్లా నుంచి విదేశాలకు వెళు తున్న వారి భద్రత కోసం వారిని పంపేందుకు ఏర్పాట్లు చేసే ఏజెంట్లు, మధ్యవర్తులకు జిల్లా పోలీ సులతో కలిసి ఇమిగ్రేషన్ అధికారులు పలు సూచ నలు చేశారు. ఈ మేరకు, శనివారం కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లా నుంచి పొట్ట కూటి కోసం విదేశాలకు వెళుతున్న వారు నిరక్షరాస్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్థానిక భాష తెలియక కష్టాల పాలవుతున్నారని తెలిపారు. విదేశాలకు వ్యక్తులను పంపేందుకు ఏర్పాట్లు చేసే ఏజంట్లు తప్పకుండా ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమి గ్రేషన్ నుంచి లైసెన్సు పొంది ఉండాలన్నారు. భారత దేశ చట్టాలకు లోబడి మాత్రమే వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి నుంచి అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వచ్చిన నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈవో కె.ది నేష్ కుమార్, హైదరాబాద్ లోని విదేశాంగ శాఖ నుంచి వచ్చిన ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అధికారి వై. అనిల్ కుమార్ మాట్లాడుతూ లైసెన్సు పొందే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాస్ సహా డీఎస్పీలు అంబికా ప్రసాద్, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.