విద్యతోనే సమానత్వం సాధ్యమని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం అన్నారు. ఉంగుటూరు జెడ్పీ హైస్కూల్లో ప్రభుత్వం, దాతల సంయుక్త నిధులు రూ.5 కోట్లతో నిర్మించిన నూతన భవనాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అజేయ కల్లం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్, సాంకేతిక విద్యను అందించేందుకు దాతలు చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వ నిధులకు తోడు పాఠశాల పూర్వ విద్యార్థి బొబ్బా వెంకటాద్రి తనతో పాటు పలువురు దాతల ఆర్థిక తోడ్పాటుతో మూడు అంతస్తుల్లో 18 అదనపు గదులు, నాలుగు డిజిటల్ తరగతి గదులు, డిజిటల్ కంప్యూటర్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న దాతలు, అజేయ కల్లం, ఎమ్మెల్యే వంశీ ల్యాబ్, అధునాతన కిచెన్, డైనింగ్ హాల్, సోలార్ విద్యుత్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, టెలిమెడిసిన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ప్రశం సనీయమన్నారు. ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి నూతన భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్ప నకు కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే తొలి విడత మనబడి నాడు - నేడు అనేక పాఠశాల ద్వారా లను నూతన హంగులతో తీర్చిదిద్దారని గుర్తుచే శారు. రెండో విడత పనులు 66 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అంది స్తున్న తోడ్పాటును విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిం చారు. అనంతరం పాఠశాల నూతన భవనాల నిర్మా ణానికి ఆర్థికంగా సహకరించిన విదేశీ, స్వదేశీ దాత లను ఎమ్మెల్యే వంశీ ఘనంగా సన్మానించారు. హెచ్ ఎం ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మంలో నరసాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరా జు, సర్పంచ్ వర ప్రసాద్, ఎంపీపీ వడ్లమూడి సరో జని, ఏపీ ఎన్ఆర్ఎఎస్ డైరెక్టర్ వెంకట్ మేడపాటి, కీటస్ చైర్మన్ శివసుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ చైర్మన్ నవీన్ దాసరి, డీఈఓ తాహెరా సుల్తానా, దాతలు బొబ్బా వెంకటాద్రి, అమెరికాకు చెందిన ప్రొఫెసర్ తోమస్ నజరీయో తదితరులు పాల్గొన్నారు.