Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRT Society ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ది, భద్రతలో భాగంగా అందిస్తున్న పథకం “ప్రవాసాంధ్ర భరోసా బీమా” రోజుకు అర్ధ రూపాయి ఖర్చుతో పది లక్షల రూపాయిలు ప్రమాద బీమా.... మీకు మీ కుటుంబానాకి ధీమా 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, ఉద్యోగులు లేదా వలస కార్మికులు 3 సంవత్సరాలకు కేవలం 550 రూపాయలు చెల్లించి ఈ బీమా పొందవచ్చు ఈ బీమా వలన కలిగే ప్రయోజనాలు: • బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం • ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు లక్ష రూపాయిలు వరకు చెల్లింపు • బీమా తీసుకున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు 50 వేల రూపాయిలు వరకు చెల్లింపు ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు.... కావాల్సిన పత్రాలు/ డాక్యూమెంట్స్ (ఉద్యోగులు, వలస కార్మికులు కొరకు): * పాసుపోర్టు ఫ్రంట్ పేజీ * పాసుపోర్టు బ్యాక్ పేజీ * ఫారిన్ రెసిడెన్స్ ప్రూఫ్ (వీసా లేదా సివిల్ ఐడీ లేదా ఆఫర్ లెటర్) గమనిక: ఈ పథకం గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రవాసాంధ్రుల కొరకు రూపొందించబడినది. ఈ పథకంలో చేరడం వలన మీరు ప్రయోజనం పొందే ఇతర ప్రభుత్వ పథకాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేడే బీమాలో నమోదు చేసుకోండి, చేయించండి.... మరిన్ని వివరాలకు ఏపిఎన్‌ఆర్‌టిఎస్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్ +91 863 2340678, వాట్సాప్ నెంబర్ +91 8500027678 ను సంప్రదించగలరు.