పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) జారి చేయుట కొరకు ఆంధ్రప్రదేశ్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ల నందు ప్రత్యేక పని దినాలను కేటాయించిన విదేశీ వ్యవహారాల శాఖ

పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) జారి చేయుట కొరకు ఆంధ్రప్రదేశ్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ల నందు ప్రత్యేక పని దినాలను కేటాయించిన విదేశీ వ్యవహారాల శాఖ
విదేశాలకు వెళ్లే వారు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) పొందడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ PCC జారి ప్రక్రియ సులభతరం చేయుట కొరకు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఈ జూన్ నెలలో 08,15, మరియు 22వ తేదీలను ప్రత్యేకంగా PCC లను జారి చేయుట కొరకే కేటాయించడం జరిగింది. ఎవరికైతే అత్యవసరంగా PCC అవసరమవుతుందో వారు ఆ తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఇది వరకే దరఖాస్తు చేసుకున్నవారు, మీకు PCC అత్యవసరం అయితే మీరు అపాయింట్మెంట్ తేదీని పునరిద్ధించుకోగలరు. కావున PCC అవసరమగు వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము.