కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రవాసాంధ్రులు శ్రీ వెంకటాద్రి బొబ్బా గారు మరియు వారి బృందం సుమారు 1.2 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు.

కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ప్రవాసాంధ్రులు శ్రీ వెంకటాద్రి బొబ్బా గారు మరియు వారి బృందం సుమారు 1.2 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ఈ విరాళంతో పాఠశాలను పూర్తిగా ఆధునీకరిస్తున్నారు. అయితే పనుల పురోగతి తెలుసుకోవడం గురించి APNRTSఅధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు ఇవాళ 19.05.022 ఉంగుటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పనుల పురోగతి గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. ఇప్పటి వరకు పూర్తైన తరగతి గదులను పరిశీలించారు. జూన్ నెలాఖరి నాటికి మొత్తం పని పూర్తి చేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో APNRTS డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి విజయకుమారి, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ కుమార్ ఇంజనీర్లు మరియు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.