Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి APNRT Trust ద్వారా పలు ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సౌకర్యాల కొరకు రూ. 28,32,265 లను విరాళంగా అందించిన విషయం విదితమే. ఇందులో భాగంగా 17.04.2022 న పశ్చిమగోదావరి జిల్లాలోని 3 ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులను పర్యవేక్షించి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. ఏలేటిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిల్ షెడ్ నిర్మాణం మరియు ప్లే కోర్టులతో ప్లే గ్రౌండ్‌ను మెరుగుపరచడం తదితర పనులు దాదాపు 70 శాతం పూర్తయ్యాయని, అలాగే తేతలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక తరగతి గదిని పార్టిషన్ ద్వారా రెండుగా చేయడం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మరియు పిల్లలకు సురక్షితమైన త్రాగునీరు కోసం వాటర్ మోటార్ పంప్ మరియు స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు, AKTP ZPH స్కూల్ కు అవసరమైన పర్నిచర్ పనులు పూర్తయ్యాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఆయా పాఠశాలలకు అవసరమైన సామాగ్రి అందించి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రధానోపాధ్యాయులు శ్రీ మేడపాటి గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేసారు.
సీఈఓ, ఏపీఎన్ఆర్టీఎస్