Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక అధికారి (అంతర్జాతీయ సహకారం) శ్రీ గీతేష్ శర్మ గారు IFS (Retd.), ఏప్రిల్ 4,5 వ తేదీలలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను కలిసి ఎన్ ఆర్ ఐ లు, వలస కార్మికులు మరియు విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్లారు. శ్రీ గీతేష్ శర్మ గారు MEA యొక్క పాస్పోర్ట్ మరియు వీసా విభాగం జాయింట్ సెక్రటరీ అయిన శ్రీ ఆర్మ్స్ట్రాంగ్ చాంగ్షాన్ గారిని కలిసి పోలీస్ క్లియరెన్స్ కొరకు అప్పాయింట్మెంట్ల కేటాయింపు మరియు సర్టిఫికేట్ అందించుటలో జరుతున్న జాప్యతను గూర్చి వారికి వివరించారు. వలస కార్మికులు ఉద్యోగ రీత్యా PCC సర్టిఫికేట్ ను 45 రోజులలో విదేశీ యజమానికి అందించాల్సి ఉండగా ప్రస్తుతం సర్టిఫికేట్ జారీ ప్రక్రియలో కలుగుతున్న జాప్యత కారణంగా వారు ఉపాధి కోల్పోయే పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతేకాకుండా, స్థానిక పాస్పోర్ట్ ఆఫీసులలో అప్పాయింట్మెంట్ల కోటా పెంచమని అలాగే వలస కార్మికులకు, వారి కుటుంబసభ్యులకు మరియు విద్యార్ధులకు అత్యవసర పరిస్థితులలో కొత్త పాస్పోర్ట్/ పాస్పోర్ట్ రెన్యువల్, PCC లకు ప్రాధాన్యత మీద అపాయింట్మెంట్లను కేటాయించాలని కోరారు. అందుకు, శ్రీ ఆర్మ్స్ట్రాంగ్ చాంగ్షాన్ గారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.