Embassy
Facebook
Twitter
Instagram
Youtube
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం హంగేరీ వెళ్లి తెలుగు విద్యార్థులు ఉంటున్న వసతి కేంద్రాల వద్దకు వెళ్లి ప్రభుత్వ సలహాదారులు, APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి, విదేశీవ్యవహారాల అధికారులు, స్థానిక స్వచ్చంద సంస్థలు, తెలుగు మరియు భారత అసోషియేషన్లతో మాట్లాడుతూ తరలింపు ప్రక్రియను సమన్వయము చేస్తున్నారు. ఇవాళ (05-03-22) ఒక్కరోజే 1100 మంది భారతీయులను భారతదేశం తరలించడం జరిగిందని, ఇందులో 100 వరకు ఏపీ విద్యార్థులున్నారని శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. మేడపాటి గారు మాట్లాడుతూ... విద్యార్థులను భారతదేశం తరలించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ పెట్రోలియంశాఖ మంత్రి గౌరవ శ్రీ. హర్దీప్ సింగ్ పురి గారితో బుడాపెస్ట్ లో సమావేశమై రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తరలింపు ప్రక్రియ లో భాగస్వామ్యమైనట్లు తెలిపారు. ఆందోళన చెందుతున్న విద్యార్ధులు మరియు వారి తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడిస్తూ సమన్వయము చేస్తున్నట్లు శ్రీ. మేడపాటి తెలిపారు. తరలింపు ప్రక్రియ సాఫీగా, సజావుగా జరుగుతుండడం పట్ల విదేశీ వ్యవహారాల స్థానిక వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ కేంద్ర మంత్రి మరియు స్థానిక వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వెంకట్ గారు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ప్రత్యెక శ్రద్ధ తీసుకొని తమ రాష్ట్ర విద్యార్థులకు ఏ లోటూ లేకుండా చూసుకోడానికి సరిహద్దు దేశాలకు అధికారులను పంపిన ఏపీ సీయం గారిని కేంద్ర మంత్రి అభినందించారు. అలాగే, హంగేరీ లోని భారత రాయబార కార్యాలయ అధికారి గౌరవ శ్రీ. తుహిన్ కుమార్ గారితో శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి సమావేశమయ్యారు. శ్రీ. తుహిన్ కుమార్ గారు మాట్లాడుతూ ఎక్కడ ఏ లోటు లేకుండా భారతీయ విద్యార్థులను స్వదేశం పంపే ఏర్పాట్లను కొనసాగిస్తున్నామని, 2,3 రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపారని శ్రీ వెంకట్ పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపెడుతున్న చొరవ పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.