Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRT Society ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ది, భద్రతలో భాగంగా అందిస్తున్న పథకం “ప్రవాసాంధ్ర భరోసా బీమా”-మీకు మీ కుటుంబానికి ధీమా. ఈ బీమా పొందాలంటే: 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, ఉద్యోగులు లేదా వలస కార్మికులు 3 సంవత్సరాలకు కేవలం 550 రూపాయలు.... విద్యార్థులు అయితే ఒక సంవత్సరానికి కేవలం 180 రూపాయలు చెల్లించి ఈ బీమా పొందవచ్చు. ఈ బీమా వలన కలిగే ప్రయోజనాలు: • బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వలన మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. • ప్రమాదం వలన సంభవించే గాయాలు, అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు లక్ష రూపాయిలు వరకు చెల్లింపు • బీమా తీసుకున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి హాస్పిటల్ ఖర్చులకు 50 వేల రూపాయిలు వరకు చెల్లింపు ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు.... కావాల్సిన పత్రాలు/ డాక్యూమెంట్స్ (ఉద్యోగులు మరియు విద్యార్థులు కొరకు): * పాసుపోర్టు ఫ్రంట్ పేజీ * పాసుపోర్టు బ్యాక్ పేజీ * ఫారిన్ రెసిడెన్స్ ప్రూఫ్ (వీసా లేదా సివిల్ ఐడీ లేదా ఆఫర్ లెటర్) మరిన్ని వివరాలకు ఏపిఎన్‌ఆర్‌టిఎస్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్ +91 863 2340678, వాట్సాప్ నెంబర్ +91 8500027678 ను సంప్రదించగలరు. https://apnrts.ap.gov.in/home/insurance_new