దుబాయ్ ఎక్స్ పో 2020 (ఇండియా పెవిలియన్) ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, పెట్టుబడులు, సేవలు మరియు APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి గారు ఫిబ్రవరి 14వ తేదీన సందర్శించారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని APNRTS కో ఆర్డినేటర్స్ మరియు తెలుగు అసోసియేషన్, యుఏఈ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు.
APNRTS ద్వారా ప్రవాసాంధ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఉచిత సేవలను 24/7 హెల్ప్ లైన్, అంబులెన్సు సేవలు, ప్రముఖ దేవాలయాల దర్శన ఏర్పాట్లను తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ప్రవాసాంధ్ర భరోసా’ బీమా వలసకార్మికుల కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమని, తెలుగు అసోసియేషన్ తరఫున ఈ బీమాలో నమోదు చేసే కార్యక్రమం చేపడతామని సూచించారు. గల్ఫ్ దేశాలలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు వృత్తి విద్యా నైపుణ్య శిక్షణా అవసరాలను ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువచ్చారు.
వలసకార్మికుల సంక్షేమం కోసం తెలుగు అసోసియేషన్స్ APNRTS తో కలసి ముందుకు రావాలని శ్రీ వెంకట్ గారు కోరారు. ప్రవాసాంధ్రులు సొంత గ్రామ, పట్టణాల్లో మౌలికవసతులు కల్పించాలనుకుంటే APNRT ట్రస్ట్ సహకరిస్తుందన్నారు. అనంతరం తెలుగు అసోసియేషన్, యుఏఈ అధ్యక్షులు మరియు సభ్యులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారిని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో APNRTS యూఏఈ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ ప్రసన్న సోమిరెడ్డి, కోఆర్డినేటర్స్ శ్రీ శ్యామ్ సురేంద్ర రెడ్డి, శ్రీ అక్రమ్, శ్రీ బ్రహ్మానంద రెడ్డి, శ్రీ నాజర్, శ్రీ హరి కృష్ణ, తెలుగు అసోసియేషన్ చైర్మన్ శ్రీ దినేష్ K.ఉగ్గిన, తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ వివేకానంద బలుస, శ్రీ మురళీ కృష్ణ నూకల, వెంకట సురేష్ వక్కలగడ్డ, శ్రీ కటారు వెంకట సుదర్శన, శ్రీ యెండూరి శ్రీనివాస రావు, శ్రీ దామెర్ల శ్రీధర్ లు పాల్గొన్నారు.