Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షోలో భాగంగా మంత్రి శ్రీ Mekapati Goutham Reddy మరియు రాష్ట్ర ప్రతినిధి బృందం, మిడిల్ ఈస్ట్ మరియు ఫార్ ఈస్ట్ దేశాల ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మరియు ప్రత్యేక ప్రతినిధి శ్రీ జుల్ఫీ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం పరస్పర ప్రయోజనకరమైన సహకార మార్గాలను చర్చించడానికి, భారత వ్యాపార సంస్థల అధిపతులతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పెట్టుబడులు, సేవలు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి ఏపీ పెవిలియన్ ను సందర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ పలు రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసులు ముందుకు రావాలని, పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులు మరియు నైపుణ్యత కలిగిన మానవవనరులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ ఏపీ ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షో కార్యక్రమం ఫిబ్రవరి 17 వ తేదీ వరకు కొనసాగుతుంది అని శ్రీ వెంకట్ మేడపాటి తెలియజేసారు.