Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS మరియు APEDB ఆధ్వర్యం లో జరిగిన “నెట్ వర్కింగ్ ఈవెంట్ విత్ యుఏఈ తెలుగు డయాస్పోర” సమావేశంలో మంత్రి Mekapati Goutham Reddy మాట్లాడుతూ.. ప్రవాసాంధ్రులు తమ మాతృభూమిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని, అపారమైన సహజ వనరులు, సుస్థిర ప్రభుత్వం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదో చక్కటి అవకాశమని వివరించారు. అనంతరం, ఏపీఎన్ఆర్టీఎస్ సహకారంతో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలలో ప్రతిభ కనబర్చినవారికి మంత్రి శ్రీ. మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో మిడిల్ ఈస్ట్ మరియు ఫార్ ఈస్ట్ దేశాల ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మరియు ప్రత్యేక ప్రతినిధి శ్రీ జుల్ఫీ, కర్నూలు శాసన సభ్యులు శ్రీ అబ్దుల్ హఫీజ్ ఖాన్, ఏపీ ఈడీబీ సీఈవో శ్రీ. సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసి చైర్మన్ శ్రీ మెట్టు గోవింద్ రెడ్డి, APNRTS యుఏఈ కో ఆర్దినేటర్స్, ప్రభుత్వ అధికారులు మరియు పరిశ్రమలు, ఏపీఐఐసీ, ఈడీబీ అధికారులు పాల్గొన్నారు.