దుబాయ్ ఎక్స్ పో 2020 లో రెండవ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఏయే రంగాలలో పెట్టుబడులు పెట్టవచ్చు, ఏపీ ప్రభుత్వ పారదర్శక పాలన గురించి చర్చిండం జరిగింది. అనంతరం APNRTS సహకారంతో మొదటి రోజు ఏర్పాటు చేసిన తెలుగు సాంస్కృతిక, సంగీత, నృత్య కళలు ప్రదర్శించిన వారికి APNRTS తరఫున శ్రీ. రవి కొమ్మరాజు ప్రశంస పత్రాలను అందజేశారు. వీక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమాలను శ్రీ కొమ్మరాజు అద్భుతంగా నిర్వహించారు. వీక్షకుల మన్ననలను పొందారు. APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి కృతజ్ఞతాభినందనలు తెలియజేసారు.
ఇవాళ దుబాయ్ లోని 'తాజ్ బిజినెస్ బే'లో సాయంత్రం 6.30 IST గంటలకు "నెట్ వర్కింగ్ ఈవెంట్ విత్ తెలుగు డయాస్పొర" పేరుతో జరుగుతున్న కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రవాసాంధ్రులకు ఏపీఎన్ఆర్టీఎస్ అందిస్తున్న సేవల గురించి తమ ప్రసంగాల ద్వారా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ ఈడీబీ సీఈవో శ్రీ. సుబ్రమణ్యం జవ్వాది గారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఏపీఐఐసీ, ఈడీబీ అధికారులు, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రతినిధులు, యుఏఈ లోని ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ ప్రత్యక్షప్రసారాన్ని క్రింది లింక్ ద్వారా వీక్షించగలరు.