APNRTS నిర్వహిస్తున్న సక్రమ వలసలపై అవగాహన సదస్సు కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరం – శ్రీ. మేడా విజయ్ శేఖర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ది ధ్యేయంగా, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి నాయకత్వంలో ప్రవాసాంధ్రులకు అనేక ఉచిత సేవలు అందిస్తోంది. APNRTS అనేక సేవలు అందించడమే కాకుండా... ఉపాధి, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళే కార్మికులకు సక్రమ వలసలపై ముందస్తు అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది.
APNRTS వలసలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఇప్పటికే సక్రమ వలసల గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా 16.12.21వ తేదీన 11 గంటలకు కడప జిల్లా టి. సుండుపల్లి మండల కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
టి. సుండుపల్లి మండల ఇన్ ఛార్జ్ శ్రీ. మేడా విజయ్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో APNRTS డైరెక్టర్ శ్రీ. బి.హెచ్. ఇలియాస్ మరియు APNRTS సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుండుపల్లి సర్పంచ్ శ్రీ. పి. శ్రీనివాస్ రెడ్డి, ప్రవాసాంధ్రులు శ్రీ. రెహ్మాన్ ఖాన్, APNRTS కువైట్ కో ఆర్డినేటర్ ఎం. కళ్యాణ్, ZPTC శ్రీ. షేక్ ఇస్మాయిల్, ప్రభుత్వ వైద్యులు శ్రీ. సునీల్ నాయక్, పంచాయతీ కార్యదర్శి శ్రీ. ఎం. సురేష్ బాబు, ST సెల్ ఇన్ ఛార్జ్ శ్రీ. నాగేంద్ర నాయక్, SC సెల్ ఇంచార్జ్ లు శ్రీ. జగన్, బండి ఈశ్వర్ మరియు శ్రీ. షేక్ కలీం, ఎం. శివా రెడ్డి, APNRTS సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ. మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ... ఏపీ ప్రభుత్వం తరఫున APNRTS నిర్వహిస్తున్న ఈ అవగాహనా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం, ఉపయోగకరమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి, అరకొర సమాచారంతో వలస వెళ్లి ఇబ్బంది పడకుండా, ప్రజలను అప్రమత్తం చేస్తున్న APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారిని ప్రశంసించారు.
APNRTS డైరెక్టర్ శ్రీ. బి.హెచ్ ఇలియాస్ గారు మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకత్వం ప్రకారం APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారి ఆధ్వర్యంలో ఈ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు, విదేశాల్లో ఉన్నవారు ఏదేని సహాయం కొరకు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లు 0863 2340678 వాట్సాప్: 85000 27678 ను సంప్రదించగలరు.