Embassy
Facebook
Twitter
Instagram
Youtube
APNRTS కార్యాలయం లో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరిగాయి. భారత రాజ్యాంగం యొక్క విలువను APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి తెలియజేసారు. ఒకరోజు కేటాయించారు కదా అని వేడుకలు నిర్వహించుకొని అంతటితో వదిలేయడం కాకుండా అందులోని అంశాలను గుర్తెరిగి, కుల, మత, వర్గ విభేదాలు చూపకుండా ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు. సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ గారు భారత రాజ్యంగా విశిష్టతను తెలియజేస్తూ, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.