'వరద సహాయక చర్యల'కు సహకరించడానికి సిద్ధంగా ఉన్న ప్రవాసాంధ్రులు

చిత్తూరు, వైఎస్‌ఆర్ కడప, ఎస్‌పిఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాల్లోని 'వరద సహాయక చర్యల'కు సహకరించడానికి సిద్ధంగా ఉన్న ప్రవాసాంధ్రులు మరియు తెలుగు సంఘాలకు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, సేవలు మరియు పెట్టుబడులు & ప్రెసిడెంట్, ఏపీఎన్ఆర్టీ సొసైటీ) APNRTS సేవలను ఉపయోగించుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా ఇబ్బందుల్లో ఉన్న వారు మీ సహాయం నుండి ప్రయోజనం పొందుతారన్నారు. మీ సహాయాన్ని పైన పేర్కొన్న వాటిల్లో... ముఖ్యమంత్రి సహాయ నిధి, APNRTS లేదా APNRT Trust ద్వారా చేయవచ్చు.
ఏదైనా నిర్దిష్ట ప్రాంతం/గ్రామానికి దుప్పట్లు, బట్టలు, మందులు, పిల్లలకు పాలపొడి, వంట పాత్రలు, ఇతరత్రా వస్తువులను విరాళంగా ఇవ్వాలనుకుంటే, APNRTS స్థానిక ప్రభుత్వ పరిపాలన అధికారుల సమన్వయంతో ఆ ప్రాంతానికి అందేలా సులభతరం చేస్తుంది.
దీనికి సంబంధించి ఏవైనా సందేహాల నివృత్తి కోసం శ్రీ. కె. కళ్యాణ్ కుమార్, మొబైల్ నంబర్: 9177285969 ని సంప్రదించండి. APNRTS గురించి మరింత సమాచారం కోసం, దయచేసి మా 24/7 హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయగలరు +91-863-2340678; +91-85000 27678.