ఏపీఎన్ఆర్టిఎస్ సహకారంతో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 28.09.2021 వ తేదీన చేరుకున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ దేశం వెళ్లగా వారు పనిచేసే ప్రదేశంలో ఇబ్బందులకు గురవుతూ చిక్కుకుపోయినమన రాష్ట్రానికి చెందిన 20 మంది వలస కార్మికులు ఏపీఎన్ఆర్టిఎస్ సహకారంతో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 28.09.2021 వ తేదీన చేరుకున్నారు. వారిని ఏపీఎన్ఆర్టిఎస్ సిబ్బంది హైదరాబాద్ నుండి విజయవాడకు బస్సు ద్వారా తీసుకురావడం జరిగింది, విజయవాడలో వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మరియు రైల్వే స్టేషన్ వరకు వాహన సదుపాయం కల్పించడం జరిగింది.
రైల్వే స్టేషన్ నందు ఏపీఎన్ఆర్టిఎస్ ప్రెసిడెంట్ శ్రీ. వెంకట్ ఎస్.మేడపాటి, సీఈఓ శ్రీ.. దినేష్ కుమార్ గారు వారికి ధైర్యం చెప్పి వారి సొంత గ్రామాలకు చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి వారిని పంపించడం జరిగింది. బాధిత కార్మికులు మాట్లాడుతూ విదేశంలో ఇబ్బందుల్లో చిక్కుకున్న తమని వెంటనే స్వదేశానికి తీసుకురావటానికి తగు ఏర్పాట్లు చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, పశు సంవర్ధక శాఖ మంత్రివర్యులు శ్రీ. సీదిరి అప్పలరాజు గారికి మరియు ఏపీఎన్ఆర్టిఎస్ ప్రెసిడెంట్ శ్రీ. వెంకట్ ఎస్.మేడపాటి మరియు సీఈఓ శ్రీ దినేష్ దినేష్ కుమార్ గార్లకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.