బాధిత కుటుంబానికి రూ. 10,00,000/- (పది లక్షలు) మొత్తానికి బీమా సంస్థ నుండి ఆమోదం పొందడంలో APNRTS విజయం

APNRTS "ప్రవాసాంధ్ర భరోసా బీమా" పథకం ప్రయోజనాలలో భాగంగా, బీమా కంపెనీ నుండి బాధిత కుటుంబానికి రూ. 10,00,000/- (పది లక్షలు) మొత్తానికి బీమా సంస్థ నుండి ఆమోదం పొందడంలో APNRTS విజయం సాధించినట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. కువైట్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న బాబు నాయుడు మాలేపాటి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయల చెక్కును 22.09.21 న రాజంపేట ఎమ్మెల్యే శ్రీ. మేడా మల్లికార్జున రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, శ్రీ. కె. శ్రీనివాసులు అందించడం జరిగింది. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ...ప్రతి ప్రవాసాంధ్రుడు ప్రవాసాంధ్ర భరోసా బీమాలో తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. పేదవారు ఎవరైనా బీమా చేసుకోవాలంటే వారి తరఫున నేను ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రీమియం చెల్లిస్తానని శ్రీ. మేడా మల్లికార్జున రెడ్డి గారు హామీ ఇచ్చారు.
APNRTS ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ ఎస్ మేడపాటి మాట్లాడుతూ "ప్రవాసాంధ్ర భరోసా బీమా" ఒక అద్భుతమైన బీమా పథకం, ఇది దురదృష్టకర మరియు ఊహించని పరిస్థితుల్లో వలసవెళ్ళిన వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాగా పనిచేస్తుందన్నారు.