Embassy
Facebook
Twitter
Instagram
Youtube
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చాలామంది ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే, వీరు సరైన అవగాహన లేకుండా, అక్రమ ఏజెంట్ల మాటలు నమ్మి విదేశం వెళ్లి తరచూ ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని అరికట్టడానికి, వలస వెళ్తున్న వారికి సరైన అవగాహన కల్గించడానికి వలసలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలలో APNRTS అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వై.ఎస్.ఆర్. కడప జిల్లా రాజంపేటలో 22.09.21 న రాజంపేట ఎమ్మెల్యే శ్రీ. ఎమ్. వెంకట మల్లికార్జున రెడ్డి, రైల్వే కోడూరు శాసన సభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ. కె. శ్రీనివాసులు చేతుల మీదుగా ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి ఈ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రంట్స్, విదేశీ వ్యవహారాla మంత్రిత్వ శాఖ శ్రీ. ముకేష్ కౌషిక్ పాల్గొన్నారు.