ఓ మహానేతా మీకివే మా ఘన నివాళులు

ఓ మహానేతా మీకివే మా ఘన నివాళులు
మహానేత, మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయంలో APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి, సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ మరియు సిబ్బంది నివాళులర్పించారు. శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు మాట్లాడుతూ అనతికాలంలోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు. ఆయన వ్యక్తిత్వం, పరిపాలనా తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు.