ఏపీఎన్ఆర్టీఎస్ ప్రధాన కార్యాలయంలో సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రకాశం పంతులు గారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకికెదురుగా గుండెను ఉంచి ‘ఆంధ్రకేసరి’గా పేరు పొందారు. రాష్ట్రానికి శ్రీ. టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు నివాళి అర్పించారు.