కోవిడ్ రెండవ దశ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కోవిడ్ వైద్య సామాగ్రి అవసరం ఉందని, తమకు అవసరమైన వైద్య సామాగ్రి పంపాలని అభ్యర్థిస్తూ తూర్పు గోదావరి జిల్లా, చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ. వెంకటరమణ APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటికి ఇమెయిల్ ద్వారా అభ్యర్ధన లేఖను పంపారు. ITDA చింతూరు కింద 1 ఏరియా ఆసుపత్రి, 1 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయని తెలిపారు. వెంటనే స్పందించిన వెంకట్ ఎస్. మేడపాటి గారు అవసరమైన వైద్య సామాగ్రిని అందిస్తామన్నారు. ప్రవాసాంధ్రులు, APNRTS రిజినల్ కో ఆర్డినేటర్ శ్రీ. టి. దుష్యంత్ రెడ్డి మరియు ఆయన స్నేహితులు పంపిన రూ. 1,70,000 లకు ఇంతకు ముందు APNRT Trust కు వివిధ దేశాల నుండి ప్రవాసాంధ్రులు, స్వచ్చంద సంస్థలు పంపిన వైద్య సామాగ్రి నుండి కొంతకలిపి మొత్తం రూ. 1,87,700 విలువగల కోవిడ్ వైద్య సామాగ్రిని తాడేపల్లి APNRTS ప్రధానకార్యాలయంలో ఇవాళ చింతూరు ITDA ప్రతినిధులకు APNRTS సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ అందించారు. ఈ సామాగ్రిలో 92 పల్స్ ఆక్సిమీటర్స్, 50 థర్మల్ స్కానర్స్, 2000 సర్జికల్ గ్లౌజెస్, 20 స్టీమ్ వాపోరైజర్స్, 5000 సర్జికల్ మాస్కులు, 700 సర్జికల్ క్యాప్స్, 500 N95 మాస్కులు, ఫేస్ షీల్డ్స్ 200, PPE కిట్స్ 200 కలవు.