కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది, తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్న నేపథ్యంలో APNRTS సహకారంతో గ్రామీణ డాక్టర్ బృందం

కోవిడ్ వ్యాప్తి పెరుగుతోంది, తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్న నేపథ్యంలో APNRTS సహకారంతో గ్రామీణ డాక్టర్ బృందం ఆగస్ట్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు (భారతదేశ కాలమానం) APNRTS ప్రధాన కార్యాలయంలో నిష్ణాతులైన భారతదేశం మరియు యుఎస్ఎ డాక్టర్లతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తోంది.
ఈ మీటింగ్ లో పెద్దలలో కోవిడ్ నిర్దారణ అయిన తర్వాత హోం ఐసోలేషన్ లో పాటించవలసిన జాగ్రత్తలు, కోవిడ్ టీకాలు, ఎటువంటి పరీక్షలు చేయవలసిన అవసరం ఉంటుంది మరియు వాడవలసిన మందుల గురించి వివరణ, కోవిడ్ నిర్దారణ అయితే డిప్రెషన్ మరియు మానసిక స్థితిపై ఎటువంటి ప్రభావం ఉంటుందనే అంశాల గురించి వివరిస్తారు.
మీటింగ్ లింక్: https://zoom.us/j/93438227618