Embassy
Facebook
Twitter
Instagram
Youtube
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి తమ వంతు సహాయంగా ఫ్రాన్స్ లోని తెలుగు మరియు ఇండియన్ అసోసియేషన్లు ముందుకొచ్చాయి. GOPIO France Metropole, Friends of India Society International (FISI) మరియు France Telugu Association(FTA)వారు 4 ఆధునిక ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను APNRT Trust కు పారిస్, ఫ్రాన్స్ నుండి విరాళంగా పంపారు. వీటిని త్వరలో ప్రభుత్వ ఆసుపత్రులకు అందించటం జరుగుతుంది. ఈ సందర్భంగా APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారు, సీఈఓ శ్రీ. కె. దినేష్ కుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైనప్పుడు తెలుగు అసోసియేషన్లు, ప్రవాసాంధ్రులు తమ వంతు సాయం అందించడం గొప్ప విషయం మరియు అభినందనీయమన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అందించిన అసోసియేషన్లను అభినందించి, కృతఙ్ఞతలు తెలిపారు.