Embassy
Facebook
Twitter
Instagram
Youtube
Health Sciences North Hospital –Canada, మరియు APNRTS సింగపూర్ టీమ్ APNRT ట్రస్ట్ కు విరాళంగా అందించిన వైద్య సామాగ్రిలో రూ. 2,65,050 విలువగల 5వేల సర్జికల్ మాస్కులు, 25 లీటర్ల శానిటైజర్, N95 మాస్కులు 200, K95 మాస్కులు 100, N99 మాస్కులు 100, 64 పల్స్ ఆక్సిమీటర్లు, 50 ఫేస్ షీల్డ్స్, 150 PPE కిట్స్, 600 సర్జికల్ క్యాప్ లను జూలై 13వ తేదీన ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో APNRTS నరసరావుపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాసరావు కు అందించారు. ఎమ్మెల్యే డా. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి తమవంతు సహాయం చేయడం అభినందనీయమన్నారు. పలుదేశాల నుండి వస్తున్న సామాగ్రిని ఒకచోటకు చేర్చి ఆసుపత్రులకు పంపిణీ చేస్తున్న APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారిని, సీఈఓ శ్రీ. దినేష్ కుమార్ గారిని ప్రశంసించారు.