రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రులకు పంపిణీ చేయమని Mask On సంస్థ – యుఎస్ఎ, Health Sciences North Hospital –Canada, మరియు APNRTS సింగపూర్ టీమ్ పంపిన వైద్య సామాగ్రిలో కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అవసరమైన రూ. 2,07,475 విలువ గల 50 చొప్పున N-99,N-95,K-95 మాస్కులు, 5వేల సర్జికల్ మాస్కులు, 50 ఫేస్ షీల్డ్స్, 700 సర్జికల్ క్యాప్స్, 25 ఓరో నాజల్ ఐసియు మాస్కులు, ఐసియు మాస్కులకు 25 ఫిల్టర్స్, మరియు 20 లీటర్ల శానిటైజర్ ను APNRTS సిబ్బంది ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. మహాలక్ష్మి గారికి జూలై 12వ తేదీన అందజేశారు. ఈ సందర్భంగా డా. మహాలక్ష్మి గారు ప్రవాసాంధ్రులకు, APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.