Embassy
Facebook
Twitter
Instagram
Youtube
రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ APNRTS ప్రవాసాంధ్రులకు అందించే సేవలు, కార్యక్రమాలలో ప్రవాసాంధ్ర భరోసా బీమా ఒకటి. వై.ఎస్.ఆర్. జిల్లా, రాజంపేట కు చెందిన షేక్ హఫీజ్ కువైట్ లో సుగంధ ద్రవ్యాల కంపెనీలో స్టోర్ కీపర్ గా పని చేస్తున్నారు. హఫీజ్ కిడ్నీ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరగా ఆపరేషన్ కు రూ. 56,800 ఖర్చు అయ్యింది. హఫీజ్ APNRTS అందించే ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకొని ఉండడం వలన (పాలసీ నంబర్: 62070146202700000003) ఇప్పుడు ఆపరేషన్ కు అయిన ఖర్చు రూ. 56,800 లను జూలై 5వ తేదీన ఇన్సూరెన్స్ కంపెనీ మంజూరు చేసింది. ఈ చెక్ ను APNRTS డైరెక్టర్ శ్రీ. బి.హెచ్. ఇలియాస్ షేక్ హాఫిజ్ కు అందించారు. అనంతరం హఫీజ్ మాట్లాడుతూ తక్కువ ప్రీమియంతో APNRTS ప్రవాసాంధ్ర భరోసా బీమా లో నమోదు చేసుకున్నాను. ఇప్పుడు కష్టకాలంలో నన్ను ఆదుకుని, ఆర్ధిక భరోసా కలిగించింది. ఇన్సూరెన్స్ కంపెనీ నుండి త్వరగా డబ్బు అందింది. దీనంతటికి కారణమైన APNRTS అధ్యక్షులు శ్రీ. వెంకట్ ఎస్. మేడపాటి గారికి, సీఈఓ శ్రీ.కె. దినేష్ కుమార్ గారికి, డైరెక్టర్ శ్రీ. బి.హెచ్ ఇలియాస్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు కొరకు ఈ వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చేయండి : https://dev.apnrts.ap.gov.in/home/insurance