APNRTS కెనడా టీమ్ మరియు కెనడా లోని Health Sciences North Hospital - డా. జగన్ రెడ్డి, ఎండి, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆధ్వర్యంలో పంపిన వైద్య సామాగ్రి నుండి రూ.1,10,000 విలువ గల కోవిడ్ వైద్య సామాగ్రిని ఇవాళ APNRTS డైరెక్టర్ శ్రీ. బి.హెచ్. ఇలియాస్ గారు అనంతపురం జిల్లా పాముదుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. పి. వెంకట నారాయణ రెడ్డికి అందించారు. ఇందులో సర్జికల్ మాస్కులు, శానిటైజర్, N95 మాస్కులు, K95 మాస్కులు, పల్స్ ఆక్సిమీటర్లు, ఫేస్ షీల్డ్స్, PPE కిట్స్, సర్జికల్ క్యాప్స్, బిపి మిషన్లు, సెలైన్ స్టాండ్, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు, పిల్లలకు, పెద్దలకు ఆక్సిజన్ మాస్కులు, నెబులైజర్, స్టెతస్కోప్, గ్లుకోమీటర్, ఇన్ఫ్రారెడ్ థర్మల్ గన్స్ తదితర సామాగ్రి కలదు. ఈ కార్యక్రమంలో PHC సిబ్బంది, NRTలు షేక్ ఫయాజ్, షేక్ గయాజ్ పాల్గొన్నారు.